జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహుజన సమాజ్ వాది పార్టీ అభినేత్రి మాయావతిని ప్రధానిగా చూడాలని తన కల అని ఇటీవల పేర్కొన్నారు. ముఖ్యంగా దళితుల హక్కుల కోసం పోరాడిన అనేకమంది మేధావులు గతంలో 2008వ సంవత్సరం నుండే వారితో కలసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ ని కోరినట్లు ఇటీవల తెలిపారు పవన్.


అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల కలిసి పని చేయలేక పోయినట్లు పవన్ కళ్యాణ్ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని తెలంగాణ ప్రజలను నమ్మించి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆయన చేయలేకపోయారు అని ఎందుకు చేయలేకపోయారో తెలంగాణ ప్రజలకు తెలియాలని పవన్ కళ్యాణ్ అన్నారు.


అయితే ప్రస్తుతం మాత్రం దేశంలో మాయావతి నాయకత్వం అవసరమని మాయావతిని ప్రధానిగా చూడటమే నా కల అని ఇటీవల పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి తన అక్క గా అభివర్ణించడం విశేషం.  



మరింత సమాచారం తెలుసుకోండి: