ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దుకాణం సర్దుకునే దాకా వచ్చినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఖాళీ అయిపోయిన తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతికించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. గత సార్వత్రిక ఎన్నికల్లో నోటికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న చంద్రబాబు తన చేతిలో ఉన్న మీడియాతోనూ మరియు అధికారంతోనూ ఇప్పటిదాకా ప్రభుత్వం నడిపించారని ప్రత్యర్థి పార్టీల రాజకీయ నేతలు కామెంట్లు చేయడం మనం చూశాం.


అయితే ప్రస్తుతం ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం లో మంత్రులుగా ఉన్న చాలామంది నేతలకు రాబోతున్న ఎన్నికలకు ఏపీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్. ముఖ్యంగా అసెంబ్లీలో 2018 పూర్తిగా కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రతిపక్ష నేత జగన్ కి సవాల్ చేసిన నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కి రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలు గట్టి షాక్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.


ఇదే బాటలో ఉన్న మంత్రులు ఎవరనగా జవహర్ నెహ్రూ. చినరాజప్ప, పితాని సత్యనారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సిద్దా రాఘవరావు, ఆదినారాయణ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వారి నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు గట్టిగా తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న వార్త.  



మరింత సమాచారం తెలుసుకోండి: