నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన మీద జరుగుతున్న అబద్ధపు ప్రచారాల మీద ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా వాటిని ఖండించారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో తెదేపా వర్గాలు తాను " చంపడమా లేక చావడమా " అంటున్న ఒక వీడియో క్లిప్పింగ్ ను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేసి, ఇప్పుడు ఏబీఎన్ ఛానెల్ లో అదే పనిగా ప్రచారం చేయడం నీచమైన రాజకీయం అని ఆయన అన్నారు.

తాను దాదాపు సంవత్సరం క్రితం యువజన సభలో యుద్ధంలో సైనికుడికి ఒకటి చంపడం లేదా చావడం మాత్రమే తెలుసు అన్నానని, జగన్ అన్న కోసం రాష్ట్రంలో ప్రాణాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని అన్నారు. ఆ క్లిప్ కి తల, తోక కత్తిరించి వారు ఇలా తప్పుడు ప్రచారం చేయడం అసలు భావ్యం కాదు అన్నారు.

ఈ యువనేత తన ప్రత్యర్థి అయిన నారాయణ వేల కోట్లు, లక్షల సెల్ ఫోన్లు, మెగా నాయకుల సపోర్టు ఉంచుకొని కూడా ఓటమి భయం నరనరాల్లో ఉంచుకొని ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. ఆయన అప్పుడు అన్న మాటలకు సంబంధించిన వీడియో లు కూడా బయటపెట్టారు, ఒక ప్రింట్ ను కూడా ప్రెస్ ముందు పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: