ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హాట్ సీజన్ నడుస్తుంది.  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మద్య హోరా హోరీ యుద్దం కొనసాగుతుందని చర్చలు కొనసాగుతున్నాయి.  ఆయా పార్టీల అధినేతలు సైతం ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.  నిన్న కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు రాహూల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా దీనిపై ప్రధాని మోదీ తనదైన శైలిలో దుయ్యబట్టారు.  సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.  తూర్పు సియాంగ్‌ జిల్లా పాసిఘాట్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో పై విమర్శలు గుప్పించారు. 


ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని..2009 నాటికి ప్రతి ఇంటికి విద్యుత్‌ సదుపాయం కల్పిస్తామని 2004లో హామీ ఇచ్చింది. కానీ 2014 వరకు 18000 గ్రామాల్లో విద్యుత్‌ సదుపాయం లేదు. ఇప్పుడు ప్రజలు అన్ని తెలుసుకొని అభివృద్ది చేసే పార్టీకే ఓటు వేస్తున్నారని...కాంగ్రెస్ ది మేనిఫెస్టో కాదు.. అబద్ధాల పుట్ట, కపటపూరిత హామీలు..కేవలం ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ పనిచేస్తుందని అన్నారు. 

మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామని..శాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం భాజపా కట్టుబడి ఉంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌ను తూర్పు ఆసియాకు గేట్‌వేగా మారుస్తామని అన్నారు. ఈ ఎన్నికలు నమ్మకానికి, అవినీతికి.. నిబద్ధతకు, కుట్రకు మధ్య జరుగుతున్న పోరు అని మోదీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: