కలికలామంటే ఇదే. చంద్రబాబునాయుడు కూడా నీతులు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజా జీవితంలో క్రమశిక్షణ గురించి చంద్రబాబు చెబుతుంటే నెల్లూరు జనాలు వినాల్సిన ఖర్మ పట్టింది. రాజకీయాల్లోకి వైసిపి నేతలు డబ్బులు సంపాదించుకోవటానికే వచ్చారట. అందుకే విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారట. 40 ఏళ్ళుగా తాను రాజకీయాల్లో విలువలకు కట్టుబడి రాజకీయం చేస్తున్నారట.

 

వైసిపిలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డికి విలువలు లేవట. భయపడిపోయి వైసిపిలో చేరారట. ఆదాలైతే డబ్బులు తీసుకుని వైసిపిలోకి ఫిరాయించారట. అప్పటికేదో ఆదాల వెళ్ళేటపుడు చంద్రబాబు డబ్బో లేకపోతే టిడిపి డబ్బో ఎత్తికెళ్ళిపోయినట్లు మాట్లాడుతున్నారు.

 

విలువలు లేని జగన్మోహన్ రెడ్డి, ఆదాల, మాగుంట లాంటి వాళ్ళని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన బాధ్యత జనాలదేనట.  నెల్లూరు జిల్లాలో అభ్యర్ధులను నిర్ణయించేటపుడు జనాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునే టికెట్లిచ్చారట. కాబట్టి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా జనాలదేననే విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు.

 

రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చిందట. తన సంకల్పానికి జనాలు మద్దతిచ్చి టిడిపి అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపిస్తే తాను ప్రక్షాళనకు పూనుకుంటారట. టిడిపిలో ఉండి బాగా డబ్బులు సంపాదించుకుని పారిపోవటానికి రాజకీయాలేమన్నా వ్యాపారమా అంటూ జనాలను ప్రశ్నించటం విడ్డూరంకాక మరేమిటి ? రాజకీయాలను వ్యాపారం చేసిందే చంద్రబాబు.  టిడిపి ఎప్పుడైతే చంద్రబాబు చేతుల్లోకి వచ్చేసిందో అప్పటి నుండో రాజకీయాలు, వ్యాపారాలకు తేడా లేకుండా చేసేశారు. అలాంటి చంద్రబాబు కూడా ఇపుడు నీతులు చెబుతున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: