ఉత్తరాంధ్రలో చాలా బలమైన పార్టీ ఏది అంటే టీడీపీ అని కొత్తగా చెప్పనక్కర్లేదు. టీడీపీ పార్టీకి ఉత్తరాంధ్ర ఒక కంచుకోట. ఇప్పటికే ఈ పార్టీని 6 సార్లు విజయం దిశగా తీసుకొచ్చిన జిల్లాలు ఇవి. రెండు సార్లు వైఎస్సార్ రాజశేఖర్ చరిష్మా తో తన వైపు టర్న్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన వారసుడు వైఎస్ జగన్ కు ,చంద్రబాబు కు ప్రధాన పోటీ నెలకొని ఉంది. జగన్ ఈసారి ఆ కంచుకోటలను బద్దలు కొట్టడానికి పార్టీ కోసం కష్ట పడ్డ ఇద్దరు యువకెరటాలకు టిక్కెట్లు ఇచ్చారు.

అక్కడ ఉన్న దిగ్గజాలను డీ కొట్టడానికి వీరిని సిద్దం చేసారు జగన్.జగన్ వారి పై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము కానివ్వకుండా చిచ్చర పిడుగుల్లా దూసుకుపోతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అదిప్ రాజ్ అనే యువకుడిని పోటీకి నిలపెట్టరు జగన్. అక్కడ ఉన్న ప్రత్యర్థి బండారు సత్యారాయణమూర్తి కి అధిప్ రాజ్ చుక్కలు చూపిస్తున్నారు. యువజన కాంగ్రెస్ లో తొలుత చిన్న నాయకుడి గా ఉండి ఇప్పుడు వైసీపీ లో చేరి బండారు లాంటి కొండను డీ కొట్టబోతున్నాడు.

తనకున్న బలంతో వైసీపీ లో చేరక ఆ ప్రాంతంలో వైసీపీ పార్టీని పూర్తిగా బలపరిచారు అదిప్ రాజ్. దీనికి ఉదాహరణగా నిన్న జరిగిన సభలో వచ్చిన జనం చూస్తే ఔరా! అనిపిస్తుంది. ఇసుక వేసిన రాలనంత జనం వచ్చరంటేనే అర్థం అవుతుంది అదిప్ రాజ్ పోరాటం. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మరో యువనేత తిలక్ కు జగన్ టిక్కెట్ కేటాయించారు. ఆయన టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఏకంగా మంత్రి అచ్చేన్న నాయుడు పై పోటీ దిగుతున్నారు.

ఇక్కడ నామినేషన్ వేసేప్పుడు తిలక్ కి వచ్చిన జనాన్ని చూస్తూ మతిపోతుంది. ఇప్పుడు ప్రత్యర్థి అచ్చెన్న నాయుడు కు చెమటలు పట్టిస్తున్నారు. ఇలా పెందుర్తి టీడీపీ అభ్యర్థి కి ఎదురుగాలులు వీస్తున్నాయి, అలాగే అచ్చన్న నాయుడు కు అసమ్మతి సెగలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయం అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: