అనంతపురం జిల్లా తెదేపా కంచుకోట అనడంలో ఎలాంటి సంశయం ఉండదు యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో. ఇక అందులోని పెనుగొండ నియోజకవర్గంలో అయితే ఇంకొక పార్టీ జెండా ఎగరడం అసంభవం అనే చెప్పాలి. ఇక్కడి నుండే పరిటాల రవీంద్ర పోటీ చేసి వరుసగా విజయాలు సాధించారు. ఆయన మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత మళ్లీ ఘన విజయం సాధించి తమకు ఎదురు లేదని నిరూపించింది.

రాష్ట్ర పునర్విభజన తరువాత రాప్తాడు నియోజకవర్గంలోకి ఇక్కడి రెండు కీలక మండలాలు వెళ్లిపోయాయి, సునీత కూడా అక్కడి నుండే పోటీ చేసింది. అయితే తెదేపా అభ్యర్థి పార్థసారథి మళ్లీ ఏకగ్రీవంగా గెలిచారు. అయితే గత ఐదు ఏళ్లలో ఇక్కడ తెదేపా పాలన పైన ప్రజలు అసంతృప్తిగా ఉన్నారట. దానితో ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి.

ఇక పోతే మొన్న జగన్ ఇక్కడ నేషనల్ హైవే పక్కన జరిపిన బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు. కేవలం పెనుగొండ మరియు హిందూపూర్ నుండి వచ్చిన ఈ జనసందోహం చూసి తెదేపా నేతల వెన్నులో వణుకు పుట్టిందట. కనీసం 15,000 ఓట్ల బంపర్ మెజారిటీ రావాల్సిన నియోజకవర్గంలో ఈ సారి టీడీపీ గెలుపు సందిగ్ధంలో పడింది అని వేరేగా చెప్పాలా ఏంటి ?


మరింత సమాచారం తెలుసుకోండి: