ఏపీలో జరిగే ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో జాసేన గెలుస్తుందన్న నమ్మకం కూడా పవన్ కి లేదనే చెప్పాలి. అంతేకాకుండా పార్టీ తరపున పోటీ చేస్తున్న 136 మందిలో ఎంతమంది గెలుస్తారనే విషయంలో పార్టీ నేతలకే స్పష్టత లేదు.

దానికి తోడు పవన్ రెండు నియోజక వర్గాల్లో పోటీ చేయడం అంటే నిజంగా సాహసోపేతమైన నిర్ణయమని చెప్పాలి. దానికి తోడు పవన్ కి ప్రజల్లో రాజకీయాలకు సంబందించిన అభిమానం కూడా ఎక్కువగా లేదనే చెప్పుకోవాలి.పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాక రెండు నియోజక వర్గాల్లో కూడా జనసేనకు పెద్దగా ఆదరణ లేదనే చెప్పాలి. దానికి తోడు పవన్ గెలుపుకు భీమవరంలో రాజులు, బిసిలు అడ్డం వ్యతిరేకంగా ఉన్నారు కానీ కాపులు మాత్రం చాలా మద్దతుగా ఉన్నారు కానీ కేవలం కాపులతోనే విజయము సాదించడమంటే అది అసాధ్యమనే చెప్పుకోవాలి. 

ఇక గాజువాకలో టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాసరావు, వైసిపి అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి ఇద్దరు కూడా అక్కడ బలమైన నాయకులే కానీ వారిని ఎదుర్కొని పవన్ నిలబడటం అంటే మాత్రం కుదరని పని. ఈ నియోజకవర్గాల్లో పవన్ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: