వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మేనియా కేవ‌లం ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం అనుకుంటే పొర‌పాటే. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీకి కూడా వైఎస్ జ‌గ‌న్ మేనియా పాకింద‌ని వీడీపీ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో వీడీపీ స‌ర్వేపై సైతం ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లుగుతోంది.ఇక వీడీపీ చేసిన స‌ర్వేలో తేలిన మ‌రికొన్ని వాస్త‌వాల‌ను ప‌రిశీలిస్తే, త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో ఏపీలో అత్య‌ధిక సీట్లు సాధించి దేశంలోనే అతిపెద్ద మూడో పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ‌త‌రించ‌బోతుంద‌ని వీడీపీ స‌ర్వే బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతోంది.


దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా స్థాపించ‌బ‌డిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే తొమ్మిది వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంది.అంతేకాదు, వైసీపీ త‌న చ‌రిత్ర‌లో రెండోసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటోంది. మొద‌టిసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం రెండు శాతం ఓట్ల‌తో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ, ఈ సారి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌తో స్ప‌ష్ట‌మైన మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంద‌ని వీడీపీ స‌ర్వే తెలిపింది. ఏపీలోని 25 పార్ల‌మెంట్ స్థానాల్లో ఏకంగా 20 స్థానాల‌ను వైసీపీ గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని ఆ స‌ర్వే ఆధారాల‌తో స‌హా పేర్కొంది.


దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీల్లో వైసీపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంద‌ని వీడీపీ స‌ర్వే సంస్థ పేర్కొంది. అయితే, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఎన్నిక‌ల అనంత‌రం ఎనిమిదో స్థానానికి ప‌డిపోతుంద‌ని, తెలంగాణ‌లో ఉన్న‌ది 17 పార్ల‌మెంట్ స్థానాలే క‌నుక టీఆర్ఎస్ నాలుగో స్థానానికే ప‌రిమితం అవుతుంద‌ని వీడీపీ స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: