వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలపై అసత్య, అసభ్య ప్రచారానికి సంబంధించిన విచారణ హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈకేసులో ముగ్గురు, నలుగురిని అరెస్టు చేశారు కూడా. ఇంటర్ నెట్ నుంచి వ్యవహారం కావడంతో దర్యాప్తు కాస్త నెమ్మదిగా జరుగుతోంది. 


తాజాగా ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నిందితులను హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. 

 యూట్యూబ్‌ చానల్‌ వాక్‌డ్‌ అవుట్‌ అండ్‌ మ్యాంగో గ్రూప్‌ ఎండీ వీరపనేని రామకృష్ణను ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాల్సిందిగా.. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. వీటితో పాటు.. టీఎఫ్‌సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌, టాలీవుడ్‌ నగర్‌, చాలెంజ్‌ మంత్ర వెబ్‌సైట్ల పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడైంది. టీఎఫ్‌సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ కార్యాలయం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లో ఉన్న ఎన్‌బీకే బిల్డింగ్‌లో ఉంది. ఇది నందమూరి బాలకృష్ణకు చెందినది కావడం విశేషం. 

వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ నాయకుల హస్తమున్నట్టు వైసీపీ నాయకులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తులోనూ అదే విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసు క్రమంగా కొలిక్కి వస్తోందని... రెండు మూడు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: