తెలుగుదేశం అధినేత చంద్రబాబు లో ఓటమి భయం పట్టుకుందా, అందుకే చంద్రబాబు ఓటర్లను భయపెడుతున్నాడా, అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో బీజీపీ, జనసేన పార్టీ మద్దతు, నూతన రాష్ట్రం కావడం తో సీనియర్ పొలిటికల్ లీడర్ అవసరమని చంద్రబాబును ఎన్నుకున్నారు ప్రజలు. కానీ ఈసారి మాత్రం బాబు వద్దు జగన్ కావాలని ఫిక్స్ అయ్యారు. ఐదేళ్లలో బాబు చేసింది ఏమిలేదని, అక్రమాలు,అవినీతి తప్ప రాష్ట్ర ప్రజలకోసం చేసింది ఏమి లేదని వారంతా వాపోతున్నారు.

ఒక్క ఛాన్స్ జగన్ కు ఇస్తే ఆయన ఏం చేస్తారో చూడాలని జనాలు ఫ్యాన్ వైపే మొగ్గు చూపిస్తున్నారు అంటూ సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇది బాబుకు కూడా తెలుసు, అందుకే బాబు ఓటర్లను బెదిరించే పనిలో పడ్డారని అంటున్నారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రసంగాల్ని గమనిస్తే, ఆయన మాటల్లో చాలా తేడా వచ్చింది. ఎన్నికల ప్రచారం మొదలైన కొత్తలో చంద్రబాబు మనదే తిరిగి అధికారం అనేవారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ని మళ్లీ గెలిపించుకోవాలని ఆయన ప్రజల్ని కోరుతున్నాడు.

అన్నింటికి మించి తనకు మరోసారి అవకాశం ఇస్తే, ఏపీ అభివృద్ధి జరుగుతుందని లేదంటే రాష్ట్రం రౌడీలపాలు అయిపోతుందని సైకలాజికల్ గా బెదిరిస్తున్నారని విశ్లేషకులు చెపుతున్నారు. మరి బాబు బెదిరింపులకు ప్రజలు ఏమని సమాధానం చెపుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: