కొన్ని పొలిటికల్ సర్వేలు అందించిన సమాచారం ప్రకారం గ్రామ స్థాయి ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టనున్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ గెలుపు అవకాశాలూ కూడా కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రజల మొగ్గు చూపి మాత్రం వైసీపీ వైపే ఉందని అంటున్నారు. పోయిన ఎన్నికలలో టీడీపీ అధినేత ప్రజలను మభ్యపెట్టి ,బీజేపీ, పవన్ సహకారంతో గెలిచారని, ఇప్పుడు ఆ అవకాశం లేదని చెబుతున్నారు.

వైసీపీ అధినేత జగన్ కు అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు అని సర్వేలు చెబుతున్నాయి. అయితే టీడీపీ నేత చంద్రబాబు చేసే ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైఎస్ వివేకనందరెడ్డి హత్యను జగన్ పై తోసేయలని టీడీపీ కుట్రలు విఫలమయ్యాయి అని వెల్లడిస్తున్నాయి. అయితే ప్రధాన పోటీ జగన్, చంద్రబాబు లదే అని, పవన్ కళ్యాణ్ మేనియా గోదావరి జిల్లా వరికే పరిమితం అంటున్నాయి సర్వేలు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు జగన్ తోనే సాధ్యం అనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీ విజయం తధ్యం అని చెప్పలేము కానీ ఇది అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచిన అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఒక్క రాత్రి లోనే రాజకీయ పరిస్థితుల ను మార్చగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు కాబట్టి తక్కువ అంచనా వేయలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: