అగ్రదేశంగా చెప్పబడే అమెరికా తమకంటే ఎవరైనా గొప్ప ఆవిశ్కరణలు చేసినా, మరింత గొప్పగా ఎదుగుతున్నా, వారిని చూసి ఏడవడం అందరికీ తెలిసిన విషయమే. మొన్న ఈ మధ్య మన భారత అంతరిక్ష పరిశోధకులు విజయవంతంగా వదిలిన "శక్తి" మిసైల్ ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

అమెరికా కూడా ఉపగ్రహాలు ధ్వంసం చేసే మిసైల్లని రూపొందించింది. అయితే భారత్ తయారు చేసిన శక్తి వల్ల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయని వాదిస్తోంది. కానీ భారత్ అంతరిక్ష పరిశోధన శాఖ మాత్రం తాము దిగువ రేఖలోనే తమ మిసైల్ టెస్ట్ చేశామని చెప్తున్నా వారి వినిపించుకోలేదు.

వారి ఐ.ఎన్.ఎస్ ఉపగ్రహానికి శక్తి వ్యర్థ శకలాల వల్ల ప్రమాదం ఉందని వాదిస్తున్నారు. దాదాపు 40-60 శకలాలు దానికి చేరువలో ఉన్నాయని, 44% ఢీకొట్టే అవకాశాలు ఉన్నట్లు కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. అయినా వారి సంగతి తెలిసిందే కాబట్టి మన వారు పెద్దగా పట్టించుకోవట్లేదు. మన చేస్తే సంసారం, అవతలి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది వాళ్ళ ఏడుపు వ్యవహారం.


మరింత సమాచారం తెలుసుకోండి: