జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు వామపక్ష పార్టీలతో మరియు బహుజన సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ...దేశం ప్రస్తుతం నాయకత్వ లోపము కలిగిన దేశంగా ఉందని దళిత హక్కుల కోసం పోరాడిన మాయావతి దేశ ప్రధాని అయితే కచ్చితంగా దేశం అభివృద్ధి బాటలో వెళుతుందని మాట్లాడుతూ పోరాట స్ఫూర్తితో మహామహులతో పోరాడిన మాయావతి రాజకీయ జీవితం అంటే తనకు ఇష్టమని ఇటువంటి పోరాట పటిమ కలిగిన నాయకురాలి తో కలసి పనిచేయడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు బాధను కలిగిస్తున్నాయని వారి జీవితాలలో మంచిని చూడాలనుకుంటున్న మాయావతితో జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటుందని 2019 ఎన్నికలకు ఇందుమూలంగా నే కొన్ని నియోజకవర్గాలలో బీఎస్పీకి స్థానాలు కేటాయించడం జరిగిందని..


రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మాయావతి బీఎస్పీ పార్టీని జాతీయ స్థాయిలో కీలకంగా మార్చడం అద్భుతమని పవన్ కళ్యాణ్ అన్నారు. మాయావతి పోరాట పటిమను చూసే 2019 ఎన్నికలకు పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు పవన్.



మరింత సమాచారం తెలుసుకోండి: