అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరు నగరం వైసీపీ అభ్యర్థి. కొండను ఢీ కొంటున్న కుర్రాడు, ఈయనతో పోటీ పడే అభ్యర్థి సామాన్యుడు కాదు. ఆయనో మంత్రి .. అంతేనా..వందల వేల కోట్ల కు అధిపతి. ఆయనే నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ. 


అలాంటి ఆర్థిక దిగ్గజంతో పెట్టుకోవడం ఎంత కష్టమైన పనో అనిల్ కుమార్ యాదవ్‌ కు తెలుసు.. అందుకే ఆయన ప్రజలనే నమ్ముకున్నాడు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ప్రత్యర్థి బలహీనతలేమిటి.. తన బలం ఏమిటి అనేది వివరించి చెబుతున్నాడు. 

తన దగ్గర డబ్బు లేదని... కానీ ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తానని ప్రజలకు వివరిస్తున్నారు. నన్ను గెలిపిస్తే మంచి ఫ్యూచర్ ఉంది. అంటూ మంత్రి అయ్యే అవకాశాన్ని వివరిస్తున్నాడు. పార్టీలకు అతీతంగా ప్రజలు తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 

కుర్రవాడినైన తనను ఓడించేందుకు మహామహులంతా ఒక్కటయ్యారని.. కానీ ప్రజల అభిమానం ఉంటే తప్పకుండా గెలుస్తానని అంటున్నాడు. ప్రజల వద్దకు వెళ్లి.. వినయంగా తన ప్లస్ పాయింట్స్  చెప్పుకుని ఓట్లు అడుగుతున్నాడు. ఆక్రమంలోనే ఆయన కన్నీరు కూడా పెట్టుకున్నాడు. ఇది ఓటర్లను ఆలోచింపజేస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: