రేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పగల నాయకుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి టైమ్ అంతగా బావున్నట్టు లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం ఆయన రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.


పార్టీతో పాటు కోడంగల్ లో స్వయంగా రేవంత్ రెడ్డి ఓడిపోవడం కూడా కలకలం సృష్టించింది. దీంతో ఆయన కొద్ది రోజులుగా మీడియాతోనూ మాట్లడకుండా ఉండిపోయారు. కానీ ఇటీవల తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో మళ్లీ దిగారు రేవంత్ రెడ్డి. 


మల్కాజ్‌ గిరిలో పోటీ చేస్తున్నారు. అయితే ఆయన గెలుస్తారా.. ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలకు బ్రహ్మశ్రీ కృష్ణమాచారి అనే జ్యోతిష్యుడు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. జ్యోతిష్యంలో.. తంత్రవిద్యల్లో స్తంభన విద్య అని ఉంటుందట. 


ఈ విద్య ద్వారా ఎదుటి వారి అభివృద్ధిని స్తంభింపజేయవచ్చట. రేవంత్ రెడ్డి అలాంటి తంత్ర ప్రయోగం జరిగి ఉంటుందని ఆయన అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి  జాతకం, గవ్వశాస్త్రం ద్వారా పరిశీలిస్తే నాలుగైదేళ్ల వరకూ ఆయనకు విజయం అన్నది ఉండదట. మరి ఇదే నిజమైతే ఆయన మల్కాజ్‌గిరిలోనూ ఓడిపోవడం ఖాయం అని అంటున్నారాయన.



మరింత సమాచారం తెలుసుకోండి: