జగన్ ఏం మాట్లాడిన దానిని ఎలా వక్రీకరించాలని టీడీపీ యెల్లో మీడియా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. జనాలను తప్పు దోవ పట్టించాలని తన సామజిక పార్టీని గట్టెక్కించాలని ఇప్పుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న జ‌గ‌న్‌... ఆ జాతీయ న్యూస్ ఛానెల్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో తాను ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకోవ‌డం లేద‌ని చెబుతూనే... మోదీ, కేసీఆర్‌ల‌పై సానుకూల‌త వ్య‌క్తం చేస్తూ జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌లు పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయ‌నే చెప్పాలి.


ఇవే వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టుకుని ఏపీలోని అధికార పార్టీ టీడీపీ జ‌గ‌న్‌పై విరుచుకుప‌డే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయినా ఈ ఇంటర్వ్యూలో జ‌గ‌న్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ ఎన్నిక‌ల్లోనూ కేంద్రంలో మోదీనే అధికారం చేప‌ట్టే అవకాశాలున్నాయ‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. మోదీ దృఢ చిత్తం ఉన్న నాయకుడని, మళ్లీ ఆయనే ప్రధాని అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల ద్వారా బీజేపీతో క‌లిసి సాగుతున్న‌ట్లుగానే జ‌గ‌న్ చెప్పిన‌ట్ట‌య్యింద‌న్న వాద‌న వినిపిస్తోంది.


ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీ ప్ర‌స్తావ‌న కూడా తెచ్చిన జ‌గ‌న్‌..  రాహుల్‌ అమేథీలో ఓడిపోతారేమో, అందుకే దక్షిణాది నుంచి పోటీ అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌తో అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీకీ దూరంగానే ఉంటూ వ‌స్తున్నామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఇటు మోదీకి అవ‌కాశ‌ముంద‌ని చెప్ప‌డం, అదే స‌మ‌యంలో రాహుల్ అమేథీలో ఓడిపోతారేమోన‌ని వ్యాఖ్యానించ‌డం ద్వారా కాంగ్రెస్ కు దూరంగా ఉన్న జ‌గ‌న్‌... బీజేపీకి మాత్రం దూరంగా ఏమీ లేర‌ని చెప్పిన‌ట్ట‌య్యింద‌న్న వాద‌న వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: