రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి హాటెస్ట్ సీటు ఏదంటే ఠక్కున వినిపించే మాట మాత్రం మంగళగిరి అనే. చిత్తూరు జిల్లాలో కుప్పంలో చంద్రబాబునాయుడు పోటీ చేస్తున్నారు. కడప జిల్లాలోని పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆ రెండు సీట్లలో ప్రత్యర్ధులెవరైనా గెలుపు మాత్రం పై అధినేతలదనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు.

 

మరి మంగళగిరి ప్రత్యేకత ఏమిటి ? ఏమిటంటే, నారావారి పుత్రరత్నం నారా లోకేష్ పోటీ చేస్తుండటమే. ప్రత్యర్ధిగా వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. దాంతో పోటీ రసవత్తరంగా జరగబోతోంది. అంటే పైకి పార్టీల మధ్య  పోటీగా కనబడుతోంది. కానీ అంతర్గతంగా మాత్రం రెండు బలమైన సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరుగా మారిపోతోందట సమీకరణలు.

 

రాష్ట్రంలో మొదటి నుండి అయితే రెడ్లు లేకపోతే కమ్మోరు అంతే. ఈ రెండు సామాజికవర్గాల చేతుల్లోనే అధికారం ఎక్కువ సార్లు కేంద్రీకృతమైందన్న విషయం తెలిసిందే. అదే ఇపుడు మంగళగిరిలో స్పష్టంగా కనబడుతోంది. నారా లోకేష్ తరపున రాష్ట్రంలోని కమ్మోళ్ళల్లోని పెద్దలంతా దిగేశారట. అదేవిధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరపున రాష్ట్రంలోని రెడ్డి పెద్దలంతా క్యాపేశారట మంగళగిరిలో.

 

ఎప్పుడైతే కమ్మ, రెడ్డి సామాజికవర్గాల్లోని పెద్దలంతా మంగళగిరిలో దిగేశారో ఎన్నిక కాస్త టిడిపి, వైసిపి లేకపోతే ఆళ్ళ, లోకేష్ మధ్య అనికాకుండా రెడ్డి, కమ్మల మధ్య ఆధిపత్య పోరుగా మారిపోయిందట. నిజానికి ఆళ్ళని ఢీ కొట్టేంత శక్తి, తెలివి లోకేష్ కు లేవన్న విషయంలో సందేహమే అవసరం లేదు. బాధితుల తరపున ఐదేళ్ళుగా ఆళ్ళ ప్రభుత్వంపై చేసిన పోరాటాలు, బాధితులను ఆదుకున్న విధానం, మధ్య, పేద తరగతులకు చేరువైన విధానం వల్ల ఆళ్ళనే గెలవాలి.

 

కానీ ఎప్పుడైతే లోకేష్ అభ్యర్ధిగా దిగారో పరిస్ధితుల్లో మార్పు వచ్చేసింది. ఎందుకంటే, కుప్పంలో తాను గెలవటం కన్నా మంగళగిరిలో లోకేష్ ను గెలిపించుకోవటం చంద్రబాబునాయుడుకు ప్రిస్టేజ్ గా మారిపోయింది. టిడిపి అధికారంలోకి వస్తుందా రాదా అన్న విషయం కన్నా లోకేష్ గెలుస్తాడా ? లేదా ? అన్నదే చంద్రబాబును తొలిచేస్తున్న ప్రశ్న. అందుకనే ప్రత్యేకంగా కమ్మోళ్ళల్లో పెద్దోళ్ళని రంగంలోకి దింపారట.

 

కమ్మోళ్ళల్లో పెద్దోళ్ళు దిగేటప్పటికి రెడ్లలో కూడా పెద్దలను మోహరించారట. అందుకే మామూలు ఎన్నికగా పైకి కనిపిస్తున్నా లోలోపల మాత్రం సామాజికవర్గాల ఆధిపత్య పోరుగా మారిపోయింది. బహుశా ఏపి చరిత్రలో ఇంతటి టెన్షన్ వాతావరణంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటరుదేవుడు ఎవరిని కరుణిస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: