కే కే సర్వే.. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా లోతుగా అధ్యయనం చేశామని చెప్పుకుంటున్నారు కేకే. ఆయన కొంత కాలంగా జిల్లా రిపోర్టులు ఇస్తున్నారు.


ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేశారు. ఆయన సర్వే ప్రకారం.. దాదాపు పదివేల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే స్థానాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ఇక మార్పు ఉండకపోవచ్చు కాబట్టి వాటిని కచ్చితంగా గెలిచే స్థానాలుగా చెబుతున్నారు. 

దీని ప్రకారం టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానాలు.. -10
వైసీపీ కచ్చితంగా గెలిచే స్థానాలు - 77
జనసేన కచ్చితంగా గెలిచే స్థానాలు - 5


ఇక పోటాపోటీ ఉండే స్థానాలు..
టీడీపీ- వైసీపీ మధ్య పోటాపోటీ ఉండే స్థానాలు :  48
వైసీపీ- జనసేన మధ్య పోటాపోటీ ఉండే స్థానాలు: 21
టీడీపీ- వైసీపీ-జనసేన మూడింటి మధ్య పోటా పోటీ ఉండే స్థానాలు: 14


ఇక ఫైనల్‌ గా ప్రతి పార్టీకి వచ్చే మినిమమ్, మేగ్జిమమ్‌ స్థానాల లెక్క చూస్తే..

టీడీపీ తక్కువలో తక్కువ 30 స్థానాలు గెలుచుకుంటుంది.. ఎక్కువలో ఎక్కువ 45 స్థానాలు గెలుచుకుంటుంది.  

వైసీపీ తక్కువలో తక్కువ 110 స్థానాలు గెలుచుకుంటుంది.. ఎక్కువలో ఎక్కువ 130 స్థానాలు గెలుచుకుంటుంది.  

జనసేన తక్కువలో తక్కువ 10 స్థానాలు గెలుచుకుంటుంది.. ఎక్కువలో ఎక్కువ 20 స్థానాలు గెలుచుకుంటుంది.  

సో... దీన్నిబట్టి చూస్తే వచ్చే ఎన్నకల్లో వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: