సరిగ్గా ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పవన్ కల్యాణ్ మీడియా ముందు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఆయన ఎక్కువగా ఆధారపడింది కాపు సామాజిక వర్గం ఓట్లపైనే.. ఈమాట రాష్ట్రంలో అందరికీ తెలుసు. 


కానీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మాత్రం పవన్ కల్యాణ్ పట్ల అంత సుముఖంగా లేరట. ఆయన  ఇప్పటికి రెండు సార్లు స్వయంగా ఇంటికి వస్తానని ముద్రగడను కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఎన్నికలయ్యాక వద్దురు లెండి అంటూ సింపుల్ గా రిజెక్ట్ చేశారట. 

తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ కాపు ఐకాన్‌ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన పోరాడారు కూడా. నిరాహారదీక్షలూ చేశారు. ఇప్పుడు ఆయన మద్దతు పొందితే ఉభయగోదావరి జిల్లాల్లో ఉపయోగం ఉంటుందని పవన్ భావించారట. 

కానీ.. ఎందుకనో ముద్రగడ మాత్రం పవన్ పట్ల అంత సానుకూలంగా కనిపించడం లేదు. అందుకే రెండు సార్లు ఇంటికి వస్తానన్నా అంగీకరించలేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఓట్లు ఎటు పడతాయోనన్న ఆందోళన జనసేన టీమ్‌లో నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: