ఎన్నికల సమయంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తమ అధినేతలకు అనుకూలంగా సోషల్ మీడియా టీమ్స్ పని చేస్తుంటాయి. అయితే కొందరు కామన్ మేన్ కూడా చాలా యాక్టివ్‌గా, ఆలోచింపజేసే విధంగా సందేశాలు పోస్టు చేస్తుంటారు. 


అలాంటి ఓ సందేశం వాట్సప్‌లో చక్కర్లు కొడుతూ ఆలోచింపజేస్తోంది.. అదేంటో మీరూ చదవండి..  

"ఎడారిలో చిక్కుకుని దాహంతో అలమటించే నిస్సహాయ యాత్రికుడికి మురికి గుంట కనిపిస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి సంకోచం లేకుండా ఆ మురికి నీళ్ళు తాగేస్తాడు. సర్వైవల్ కోసం జంతువులన్నీ ఆ పని చేస్తూనే వస్తున్నాయి.

అందులో తెలివి వుండదు. ఆ క్షణానికి బతికితే చాలనే తపన వుంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  చిక్కుకున్న ఓటర్లు , చంద్రబాబు అనే ఎడారి లో దాహంతో అలమటిస్తూ తిరుగుతున్నారు.

వారు, బాబు దిగుమతి చేసిన సింగపూర్ ఎండమావులకై  పరిగెత్తి పరిగెత్తి కూలిపోతారా? లేక జగన్ రూపంలో కనిపిస్తున్న మురికి నీళ్ళు తాగి  ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకుంటారా ? అనేది పూర్తిగా ఓటర్ల కామన్ సెన్సే నిర్ణయిస్తుంది.

దీనికి ఒక పెద్ద రాజకీయ విశ్లేషణా , సిద్ధాంతాలూ అవసరమా? విషయం ఇంత సరళంగా వుంటే , ఆ ఎండమావులను నిజమని నమ్మించడం ఎంత నేరమో ఆ మురికి గుంటను ఒయాసిస్ అని నమ్మ బలకడం కూడా అంతే పెద్ద మోసం.



మరింత సమాచారం తెలుసుకోండి: