ఆమధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం గుర్తుంది కదా ? తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తగదంటూ ముందు షర్మిల అప్పీల్ చేశారు. కానీ అది ఆగకపోగా మరింత పెరగకపోవటంతో హైదరాబాద్ లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరే కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు తీగలాగటం మొదలుపెట్టారు. తీరా చూస్తే పోలీసులకు షాకింగ్ నిజాలు బయట పడ్డాయి.

 

టిడిపి అగ్రనేతల ఆదేశాలతోనే షర్మిలపై దుష్ప్రచారాన్ని ఓ ప్రణాళిక ప్రకారం చేసినట్లు తెలిసింది. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు యూట్యూబ్ లింకులు, వీడియోల ఏపి అడ్రస్ ల ఆధారంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తీరా చూస్తే మొత్తం వ్యవహారమంతా హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని ఓ భవనం నుండే జరుగుతోందనే విషయం బయటపడింది. ఇంతకీ ఆ భవనం ఎవరిదనుకుంటున్నారు ? నందమూరి బాలకృష్ణ భవన అట. నందమూరి బాలకృష్ణ అంటే చంద్రబాబునాయుడు బావమరిది కమ్ వియ్యంకుడు కమ్ హిందపురం ఎంఎల్ఏ అన్న విషయం తెలిసిందే.

 

బాలకృష్ణ భవనంలో నుండే షర్మిలపై బురదచల్లే కార్యక్రమం జరిగిందని తేలగానే పార్టీలోని అగ్రనేతల డైరెక్షన్ లోనే సాగినట్లు అర్ధమైపోతోంది. కాకపోతే తన భవనంలోనే టిఎఫ్సి కార్యాలయం పెట్టుకుని షర్మిలపై దుష్ప్రచారం జరుగుతోందని బాలకృష్ణకు తెలుసో లేదో మాత్రం పోలీసులకు తెలియలేదు. అదే సమయంలో షర్మిలపైనే కాకుండా వైఎస్ఆర్సీపీ పైన కూడా నెగిటివ్ ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఎప్పుడైతే షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసిందో వెంటనే కార్యాలయాన్ని బాలకృష్ణ భవన్ లో మూసేశారు.

 

హైదరాబాద్ లో ఉంటూ వైఎస్సార్సీపీ, షర్మిల మీద దుష్ర్పచారం చేస్తే తమను పట్టుకుంటే ఆ కేసులో నుండి బయటపడటం కష్టమని అర్ధమవ్వగానే సదరు వ్యక్తులు బిచాణా ఎత్తేసి ఏపిలోకి పారిపోయారని సమాచారం. టిఎఫ్సి మీడియా ప్రైవేటు లిమిటెడ్  సంబంధించిన డైరెక్టర్లు శాఖమూరి తేజోభాను, ప్రియదర్శిని, రామకృష్ణ వీరపనేని, ఏదుగాని మల్లేష్, చీపురుపల్లి రాంబాబులపై పోలీసులు కేసులు పెట్టారు. ఇందులోని కీలక వ్యక్తులంతా ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నట్లు సమాచారం. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: