ఏపీలో ఎన్నికలు కీలక‌ దశకు చేరుకున్నాయి. ఇంక ప్రచారానికి ఈ రోజుతో కలుపుకుంటే అచ్చంగా ఆరు రోజులు మాత్రమే ఉంది. అంటే అత్యంత పకడ్బంధీగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉందన్న మాట. వారు జనాలకు ఇచ్చే సందేశమే రేపటి రోజుల ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుంది.


ఐతే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తాను రొటీన్ అంటున్నారు. ఆయన స్పీచ్ ఎక్కడా మారడంలేదు. ఎన్నికలకు ముందు ఏ పాట పాడారో ఇపుడు కూడా అదే పాడుతున్నారు. కుమ్మక్కు రాజకీయాలు,  కేసీయార్, మోడీతో వైసీపీ పొత్తు,  జగన్ నేరగాడు, అవినీతి పరుడు ఇవే చంద్రబాబు మాటలు. విని విని జనం విసుగెత్తిపోయారు. పోలింగ్ దగ్గరలో అయినా బాబు ట్రాక్ మారుస్తారేమోనని ఆశించినా ఫలితం శూన్యంగా ఉందంటున్నారు తమ్ముళ్ళు


ఇదే నెగిటివ్ ప్రచారం కొనసాగించినట్లైతే బూమరాంగ్ అవుతుందని టీడీపీ స్ట్రాజజీ  వింగ్ మొత్తుకుంటోంది. కానీ బాబు గారు ఆక్రోశం ఆపుకోలేక అందరినీ కలిపి తిడుతున్నారు. వచ్చిన జనాలు ఏ మాత్రం రెస్పాండ్ కాకున్నా బాబు తీరు మాత్రం మారడం లేదు. మరి ఇదే వైఖరి తీసుకుంటే బాబు పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరో వైపు బాబు కుమ్మక్కు ఆరోపణలను జగన్, షర్మిల, విజయమ్మ ఎక్కడికక్కడ ఖండిచేస్తున్నా బాబు అదే బ్రహ్మాస్త్రమని భావించడం ఏ రకమైన మేలు చేకూరుస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: