ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మొదలైంది. ఏపీలో  ఢీ అంటీ ఢీ అంటున్న ఎన్నికల్లో ఈసారి ఎవరు విజేత అవుతారన్నది చాలా ఇంటెరెస్టింగ్ పాయింట్ గా ఉంది. ప్రతి ఓటు  కూడా ముఖ్యమైపోతున్న ఎన్నికలు ఇవి. దాంతో పోస్టల్ బ్యాలెట్ కి కూడా ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది.


పోస్టల్ బ్యాలెట్ ఓటింగుని ఓట్ల లెక్కింపు తేదీ వరకూ  చేసుకోవచ్చునని ఎన్నికల సంఘం క్లారిటీగా చెప్పేసింది. అంటే ఇపుడు మొదలైన ఈ బ్యాలెట్ మే 23 వరకూ ఓటు చేసుకునే వీలు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటుందన్న మాట. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒకప్పుడు కాంగ్రెస్ వైపు ఉండేవారన్న మాట ఉంది. అయితే ఆ తరువాత రోజుల్లో టీడీపీ కూడా వారిని బాగానే ఆకట్టుకుంది. ఇక 2014 ఎన్నికల్లో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు గుత్తమొత్తంగా టీడీపీకే పడ్డాయి.


అనుభవం, సీనియారిటీ అంటూ వారంతా బాబుకే ఓటేశారు. మరి అయిదేళ్ల తరువాత ఉద్యోగులు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నారన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే పోలింగ్ జరిగిన సరళి బట్టి చూస్తే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరో వైపు పోలీసులు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ద్వార. వారి మనోభావాలు బయటకు తెలియకుండా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువమంది పోస్టల్ బ్యాలెట్ కి మొగ్గు చూపడం, కచ్చితంగా తమ ఓటు వేయాలని పట్టుదలగా ఉండడం బట్టి చూస్తూంటే ఏపీ ఎన్నికల ఫలితాలు సంచలనంగా ఉంటాయని అర్ధమవుతోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: