ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఇదే సమయంలో తన సొంత నియోజక వర్గంలో కూడా  పర్యటించకుండా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. సొంత నియోజకవర్గం కుప్పం వ్యవహారాన్ని చంద్రబాబు తన భార్య భువనేశ్వరికి అప్పగించారు. 


నారా భువనేశ్వరి.. హెరిటేజ్ ఫుడ్స్  సంస్థను అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన మహిళా పారిశ్రామిక వేత్త. అయితే ఆమెది ఎంత రాజకీయ కుటుంబమైనా ఆమె పెద్దగా జనంలోకి వచ్చింది లేదు. కానీ ఇప్పుడు ఆమె మొదటిసారి రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. 

ప్రతి రోజూ టెలీ కాన్ఫరెన్సులు పెట్టి లోకల్ నాయకులతో మాట్లాడుతున్నారు. పోల్ మేనేజ్‌ మెంట్ గురించి ఆరా తీస్తున్నారు. ఇటీవల ఆమె టెలికాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు వద్దు.. చిన్నా పెద్దా లీడర్లు అందరిమీదా కన్నేయండి.. ఎవరినీ లైట్‌ గా తీసుకోవద్దు. మీరు వాళ్లను పట్టించుకోకపోతే.. వారు ప్రలోభాలకు ఈజీగా లొంగిపోతారు.. చాలా జాగ్రత్తగా ఉండండి.. 

ముఖ్యమైన నేతలతో అవసరమైతే నేను మాట్లాడుతా.. అంటూ లోకల్ నేతలకు భువనేశ్వరి హితబోధ చేస్తున్నారు. ఇప్పటివరకూ కేవలం ఫంక్షన్లు, హెరిటేజ్‌ కార్యక్రమాల్లోనే కనిపించిన భువనేశ్వరి మేనేజ్‌మెంట్‌ స్కిల్స్ ఈ ఆడియోతో తెలిసిపోతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: