ఎక్కడైన స్నెహం కానీ రాజకీయం దగ్గర కాదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. భార్యాభర్తల మధ్య పోటీ కూడా ఉన్న రాజకీయాలను చూసారంతా. ఇంట్లోనే బంధాలు బయటకు వచ్చాక ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు తోచిన పార్టీలు ఎంచుకుంటారు. తమ వారి మీదనే బాణాలు ఎక్కుపెడతారు.


సినిమాల్లో టాప్ కమెడియన్ అలీ, అలాగే పవన్ కళ్యాణ్ మధ్య బంధం చాల గొప్పది. వీరి స్నేహం కూడా గట్టిది. ఆలీ లేకపోతే సినిమా చేయను అనే దాక పవన్ వెళ్ళారంటేనే వీరి మధ్య ఉన్న బాండేజ్ అర్ధ‌మవుతుంది. అటువంటి ఆలీ పవన్ జనసేనలో చేరుతారని అంతా భావించారు. అయితే ఆలీ జనసేన, టీడీపీ తిరిగి చివరకి వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇవ్వలేదు. సరే ఆలీకి ఏ హామీ లభించిందో తెలియదు కానీ కొన్ని రోజులుగా వైసీపీకి అనుకూలంగా  ఉత్తరాంధ్రాలో  జోరుగా ప్రచారం చేస్తున్నారు.


ఆయన అన్నీ తిరిగి ఛివరకి పవన్ పోటీ చేస్తున్న గాజువాకకు వచ్చారు. అక్కడ ఆలీ వైసీపీ అభ్యర్ధి నాగిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. జగన్ సీఎం అన్నారు. ఆయనకే మన ఓటు వేయాలని గట్టిగా కోరారు. నాగిరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించారని కూడా పిలుపు ఇచ్చారు. మరి అక్కడ నాగిరెడ్డికి ప్రత్యర్ధి పవన్. పవన్ ఓటమి కోరుకుంటూ ఆలీ ప్రచారం చేయాడం నిజంగా విడ్డూరమే. ఇప్పటికైతే చంద్రబాబు, జగన్ కూడా గాజువాక వెళ్ళలేదు. పవన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసిన టాప్ సెలిబ్రిటీ ఆలీ అంటే ఆశ్చర్యమే మరి. ఏమైన ఇది రాజకీయం. అంతే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: