ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్న 2019 ఎన్నికల్లో ఉత్కంఠభరితంగా తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. 2014 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు బిజెపి మరియు జనసేన పార్టీలతో కలసి జగన్ పై కొద్దిపాటి తేడా ఓటింగ్ శాతం తో అధికారంలోకి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం రాబోతున్న ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు అన్నట్టుగా ఉన్నాయి సర్వేల ఫలితాలు.


ఇప్పటికే ఆంధ్రరాష్ట్రంలో జరిగిన పలు జాతీయ సర్వేలో ను మరియు ప్రముఖ సంస్థల సర్వేలలో వైసిపి పార్టీ విజయం తధ్యమని జగన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని ఫలితాలు వచ్చిన విషయం మనకందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ సంస్థ అయినా హైదరాబాద్ నగరానికి చెందిన - CPS ఆంధ్ర రాష్ట్రం లో సర్వే చేసింది. ఈ సర్వేలో దిమ్మతిరిగిపోయే ఫలితాలు బయటకు వచ్చాయి.


ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇస్తున్న హామీలు పట్ల ప్రజలు నమ్మడం లేదని మరియు అదే విధంగా ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట పూటకో తీరు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని ముందే నుండి ప్రత్యేక హోదా విషయంలో బలంగా నిలబడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్ర ప్రజలు నమ్ముతున్నారని ఈ సర్వేల ఫలితాలలో వెల్లడైంది.


అంతేకాకుండా రాబోయే ఎన్నికలలో జగన్ పార్టీకి దాదాపు 121 నుంచి 130 సీట్లు రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీకి 45 నుండి 54 స్థానాలు వస్తాయని..మరియు జనసేన పార్టీకి ఒకటి రెండు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తంమీద చూసుకుంటే ఎన్నికల ముందు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు బలంగా గమనిస్తున్నారని..గతంలో ఆయన చేసిన వాగ్దానాలను ఏపీ ప్రజలు నమ్మడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: