ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు పవన్‌ కల్యాణే హాట్ టాపిక్.. ఆయన కింగ్ అవుతాడా.. కింగ్ మేకర్ అవుతాడా.. ఆయన పార్టీ గెలుస్తుందా... లేక ఎవరి ఓట్లను చీలుస్తుంది.. పవన్ ఎవరి కొంప ముంచుతాడు.. ఎవరిని ఒడ్డున పడేస్తాడు..ఇదే ఇప్పుడు హాట్ చర్చ.


ఉత్తరాంధ్రలో ఈ చర్చల్లో పాల్గొన్న ఓ అభిమాని పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకపోవచ్చు కానీ.. ఆయన పార్టీ కచ్చితంగా నెగ్గాలని ఫీలవుతున్నాడు. పవన్ కల్యాణ్‌ సీఎం కాకపోవచ్చు.. కానీ ఆయనకో 20 -30 సీట్లు వస్తే బావుండని ఆశపడుతున్నాడు. 

పవన్ కల్యాణ్‌కు 20 సీట్లు వచ్చినా.. ప్రస్తుతం ఉన్న పార్టీలను ఉ.. పోయిస్తాడంటూ బూతులతోనే తన అభిమానం ప్రకటించుకున్నాడు. కానీ ఇది నిజమేనా ఓ సారి ఆలోచిస్తే...ఇది వాస్తవంలో చాలా అసంబద్దంగా ఉంటుంది. ఎందుకంటే.. పవన్ కు 20 సీట్లు వచ్చినా ఆయన కింగ్‌ మేకర్ అయ్యే అవకాశం ఉంటేనే ఆయన మాటకు విలువ ఉంటుంది. 

ఒకవేళ పవన్‌ కు 20 సీట్లు వచ్చినా.. ఎన్నికల తర్వాత ఆయనతో ఉంటారన్న గ్యారంటీ ఏమీ ఉండదు.. హంగ్ వస్తే.. వాళ్లను ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ కొనేయడం ఖాయం.. అప్పుడు ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పవన్ గింజుకుంటాడు తప్ప.. మిగిలిన పార్టీలను ఉ.. పోయించే ఛాన్సే లేదంటోంది ఆంధ్రప్రజ.



మరింత సమాచారం తెలుసుకోండి: