ఎన్నిక‌లు వేవైనా, గెలుపోట‌ములు ఎవ‌రిని వ‌రించినా స‌ర్వేలు హ‌ల్‌చ‌ల్ చేయ‌డం కామ‌న్‌. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇంటెలిజెన్స్ నిఘా వ‌ర్గాల ద్వారా త‌న పార్టీ అభ్య‌ర్ధుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయిస్తూ ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. వీటిపై జర్నలిస్ట్ సాయి వివరణ ఇచ్చారు. అన్ని సర్వేలలో ఏది నిజం ఏది అబద్దం అనేది చెప్పడం కష్టం అన్నారు. 


వేణుగోపాలరావు ఆ మధ్య తెరాస పార్టీ 88 సీట్లు పైబడి గెలుస్తుందని ఒక సర్వేను ఇచ్చారు. దీని పై చర్చలు కూడా జరగాయి. ఇలాంటి సర్వేలు ఇవ్వడం లో సిద్దహస్తులైన లగడపాటి సర్వేను తప్పని వేణుగోపాలరావు కొట్టిపారేశారు. ఆయన తెరాస పార్టీ కి 90 సీట్లు వస్తాయి అని కూడా అన్నారు.


ఈయన ఒకప్పుడు 2006 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా సర్వేలు చేసి పెట్టారని అన్నారు సాయి. ఈ సర్వే కు అప్పట్లో మంచి ఆదరణ లభించింది. చాలా మందిని కలిసి అంటే దాదాపు కొన్ని లక్షల మందిని అడిగి సర్వే చేసినట్టు అప్పుడు ప్రచారం అయ్యింది అన్నారు.


అయితే ఈ సారి వేణుగోపాల రావు సర్వే ప్రకారం వైసీపీ పార్టీ కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇయన చెప్పారు. ఇందులో 121 - 130  ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఎంపీ స్థానాలు 21 దాకా వస్తాయి అని తెలిపారు. అలాగే టీడీపీ పార్టీకి 45 - 55 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలు వస్తాయని అని అన్నారు. ఇక పోతే జనసేన పార్టీకి 1 లేదా 2 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని ఎంపీ స్థానాలు అసలు రావని తేల్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: