ఎన్నిక‌ల వేళ క‌లిసి ముందుకు సాగాల్సిన టీడీపీలో విభేదాలు వీధుల‌కెక్కుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచే యాల్సిన చోట‌.. ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను రోడ్ల మీద‌కు లాక్కుని ప్ర‌జ‌ల ముందు ప‌లుచ‌న అవుతున్నారు. ము ఖ్యంగా అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ గోదావ‌రిలోని చింత‌ల‌పూడిలో టీడీపీ రాజ‌కీయాలు రోడ్డున ప‌డ్డా యి. ఇక్కడ నుంచి టీడీపీ నాయ‌కురాలు, ద‌ళితుల ఆశాజ్యోతి, మాజీ మంత్రి పీత‌ల సుజాత ప్రాతినిధ్యం వ‌హిస్తు న్నారు. అ యితే, వివిధ రాజ‌కీయ కార‌ణాల నేప‌థ్యంలో సుజాత‌ను ప‌క్క‌న పెట్టిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు.. ఇక్క‌డ నుంచి క‌ర్రా రాజారావుకు అవ‌కాశం ఇచ్చారు. 


అయితే, ఈవిష‌యాన్నిపాజిటివ్‌గా తీసుకున్నారు సుజాత‌. త‌న‌కు వీలున్న‌ప్పుడ‌ల్లా వ‌చ్చి ఇక్క‌డ రాజారావుకు అనుకూ లంగా ప్ర‌చారం చేస్తూ.. టీడీపీని గెలిపించే బాధ్య‌త‌ను మ‌రోసారి భుజాల‌పైకి ఎత్తుకున్నారు. అయితే, ఇంత‌లోనే రంగ ప్ర‌వేశం చేసిన టీడీపీ నాయ‌కుడు, ఏపీ ఫిలిం కార్పొరేష‌న్ చైర్మ‌న్ అంబికా కృ్ష్ణ... సుజాత‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీతల సుజాత హయాంలో అభివృద్ధి జరగలేదని, ఆ పాపం కడిగేసుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ అభ్యర్థిని మార్చారని జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో అంబికా కృష్ణ వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు.


ఈ వ్యాఖ్య‌ల‌పై పీత‌ల సుజాత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ తరఫున ప్రచా రం చేసి ఆర్యవైశ్యులను పార్టీకి దగ్గర చేయమని పార్టీ ఆదేశిస్తే, అంబికా కృష్ణ ఆ పని చేయకుండా తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్షంతో లాలూచీ పడి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి అంబికా కృష్ణ కంకణం కట్టుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు.

తానేమీ అంబికా కృష్ణలా సొంత బావమరిది హోటల్‌ను ఆక్రమించుకోలేదని, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు ఎగ్గొట్టలేదని ఎద్దేవా చేశారు. తనపై విమర్శలు చేసే వారిని ఇక ఉపేక్షించేది లేదని ఎవరినైనా చెంప ఛెళ్లుమనిపిస్తానని హెచ్చరించారు. అంబికా కృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తానని సుజాత వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: