జేడీ లక్ష్మి నారాయణ..  జగన్ కేసుల ద్వారా బాగా సుపరిచితుడయ్యాడు. అప్పుడు టీడీపీ మీడియా కు జగన్ కేసు గురించి లీకులు ఇస్తూ , కేసు వ్యవహారాన్ని కొనసాగించాడు. దీనితో జేడీ ని టీడీపీ మీడియా ఓ రేంజ్ లో చూపించింది.  అప్పట్లో అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరించారనే విమర్శకు గురయ్యారు. జగన్ కేసుల్లో లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మోపిన అనేక అభియోగాలు ఆ తర్వాత కోర్టులో చెదిరిపోవడమే అందుకు రుజువు కూడా.


ఆ సంగతలా ఉంటే.. జగన్ కేసుల్లో విచారణ చేశాడు కాబట్టి.. ఆయన గొప్పోడు అని తెలుగుదేశం పార్టీ ఆయన కోసం కటౌట్లు కట్టినప్పుడే రాజకీయమయం అయిపోయింది లక్ష్మినారాయణ వ్యవహారం. ఆ తర్వాత ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటూ ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా బయటకు వచ్చారు. సొంత పార్టీ అని హడావుడి చేశారు. ఆ తర్వాత దివాళా దశలో ఉన్న లోక్ సత్తాను టేకోవర్ అని అన్నారు. 


అయితే మొన్న ఆ మధ్య టీడీపీలోకి చేరుతున్నట్లు లీకులు ఇచ్చారు. కానీ జేడి మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనితో వెనక్కి తగ్గిన జేడీ ఎట్టకేలకు జనసేన పార్టీలోకి చేరిపోయాడు. చేరడమే కాకుండా విశాఖ ఎంపీగా బరిలోకి దిగుతున్నాడు. అయితే జేడీ ..విశాఖలో తన సామజిక వర్గం అయినా కాపుల పెద్దలతో సమావేశం కావటం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. మతాలకు, కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తామని చెప్పిన జేడీ , పవన్ ఏంటిది అని రిటైర్డ్ ప్రొఫెసర్ కిర్ల విజయ కుమార్ ఆరోపించారు. ఇటువంటి కుల రాజకీయాలు చేస్తే మీకు ఎన్నికల్లో డిపాజిట్స్ కూడా దక్కవని హెచ్చరించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: