వైసీపీ పార్టీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు లో పర్యటించిన క్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ  అధికార పార్టీ టిడిపి నిర్మిస్తున్న ఇంటి కోసం అప్పు చేసినవారికి అధికారంలోకి రాగానే తీసుకున్న అప్పులను రద్దు చేయడం ఖాయమని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో నెల్లూరు జిల్లా మొత్తం వైసిపి పార్టీకి అండగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ...టీడీపీ ఇస్తున్న ఇల్లు తీసుకోవాలని ఎవరూ భయపడవద్దని జగన్ పేర్కొన్నారు.


పేదలకు ఉచితంగా వచ్చే ఇళ్లపై అక్రమంగా తెలుగుదేశం ప్రభుత్వం సంపాదించాలని చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎండగట్టారు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం  ఇళ్ల కోసం ఇచ్చే రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబు హయాంలో పేదలకు చదువు దూరమైందని...ఉద్యాన మొత్తం తన బినామీలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పజెబుతూ ...ప్రాధమిక విద్య నుండి ఇంజనీరింగ్ చదివే వరకు విద్యను ప్రైవేటీకరించారని జగన్ ఆరోపించారు.


చంద్రబాబు హయాంలో నాలుగున్నర సంవత్సరాలలో ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధి జరగలేదని కానీ ఎన్నికల చివరాకరికి వచ్చేసరికి ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పుకొంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ పేర్కొన్నారు.


వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడు సంతోషంగా బతికేలా వారి పిల్లలు ఉన్నత చదువులు చదివే ల సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయని జగన్ హామీ ఇచ్చారు. అయితే రానున్న ఎన్నికల్లో ఇంకా కొద్ది రోజులే ప్రచారం మిగిలి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు చెప్పే అబద్ధాలకు మోసపోవద్దని మరొకసారి మనల్ని మనం మోసం చేసుకోకుండా రాష్ట్రాన్ని కాపాడుకుందామని ప్రజలకు సూచించారు జగన్.  



మరింత సమాచారం తెలుసుకోండి: