ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ భాగం వ్యవసాయ రంగంపై ఆధారపడిన కుటుంబాలే ఉన్న నేపథ్యంలో ముందు నుండి వ్యవసాయ రంగానికి మరియు రైతులకు పెద్ద పీట వేస్తూ జగన్ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గతంలో. అంతేకాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రైతాంగం ఎక్కువగా ఉన్న క్రమంగా అసాధ్యమైన రైతు రుణమాఫీ ని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులను మోసం చేశారని ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అనేకసార్లు ఆరోపించడం జరిగింది.


ఇదిలా ఉండగా ప్రస్తుతం మరో వారంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎన్నికల ప్రచారంలో జోరుగా ఉన్న వైసిపి పార్టీ అధినేత జగన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం సంచలన హామీ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల కోసం రూ. 4 వేల కోట్లతో  ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.


ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మాట్లాడుతూ పంట దిగుబడి సమయంలో ధరలు తగ్గుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న రైతులను తమ లాభాల కోసం చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటుందని రైతుల భూములను లాక్కొని రాక్షస ఆనందం చంద్రబాబు పొందుతున్నారని జగన్ విమర్శించారు.


అంతేకాకుండా ఏ విధంగానైనా రైతులు మృత్యువాత పడితే ఆ రైతు కుటుంబానికి రూ. 7 లక్షలను అందిస్తామని ...మరి కొన్ని రోజులు ఓపిక పడితే వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ ప్రజలకు సూచించారు. ఇంకా కొద్దిరోజులే ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇష్టానుసారమైన హామీలు ఇస్తారని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని జగన్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: