ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నట్లుగానే అధికార తెదేపా నాయకుల ధన ప్రవాహం సునామీ మొదలైందనే చెప్పాలి.జయభేరీ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.   పట్టపగలే అక్షరాల రెండు కోట్ల రూపాయలు అదీ సామాన్య ప్రజలు ప్రయాణించే రైళ్ల ద్వారా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని చూసిన డబ్బులు. బుధవారం రాత్రి నిమ్మలూరి శ్రీహరి (44), అరుటి పండరి (39) అనే ఇద్దరు వ్యక్తులు బ్యాగుల్లో నగదు తరలిస్తుండగా... హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.


సంచలనం రేపిన ఈ రెండు కోట్ల రూపాయల విషయంలో హైదరాబాద్ సైబర్ కమీషనర్ సజ్జనార్ సంచలన విషయాలు తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని 21 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.  హైటెక్ సీటీ రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి నిమ్మలూరి శ్రీహరి,అవూరి పాండరి లపై అనుమానం వచ్చింది.  వారి వద్దరెండు బ్యాగ్ లు ఉన్నాయి  రెండు కోట్ల నగదు బ్యాగ్ లో తీసుకెళుతున్నారు.  యలమంచిలి మురళిమోహన్ కు ఇచ్చేందుకు తీసుకెళుతున్నట్లు వాళ్ళు చెప్పారు.


 ఈ కేసులో మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశామన్నారు.  నిమ్మలూరి శ్రీహరి,పండరి,జగన్,ధర్మరాజు, మురళికృష్ణ, ఎంపీ మురళిమోహన్ పై కేసులు నమోదు చేశామన్నారు.  కాగా,  జగన్,ధర్మరాజులు జయభేరి ఉద్యోగులకు డబ్బులు ఇచ్చి మురళిమోహన్ కు ఇవ్వమన్నారు.  ఈ డబ్బులు జయబేరి సంస్థకు చెందిన నగదుగా గుర్తించాంమని అన్నారు మురళిమోహన్ పై కేసు నమోదు చేసిన సైబారాబాద్ పోలీసులు. వారిపై సెక్షన్ 171 బీ, సీ,ఈ,ఎఫ్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరునంలో సైబరాబాద్ పరిధిలో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: