ప్రపంచంలోనే అతి సురక్షితమైన దేశంగా స్విట్జర్లాండ్ గుర్తించబడింది. ఇది అత్యంత ధనిక దేశాల్లో కూడా ఒకటి. అయితే మొత్తం మంచు పర్వతాలతో నిండి ఉన్న ఈ దేశంలో జనాభా దగ్గర దగ్గర మన హైదరాబాద్ అంత ఉంటుంది. అయితే దాదాపు 150 - 200 సంవత్సరాల క్రితం ఈ దేశం అంతా బురద నేల. కానీ వీరికున్న ప్రత్యేక పాలసీలు, నిబంధనల కారణంగా ఎంతో గొప్పగా ఎదుగుతూ వచ్చారు ఈ దేశవాసీయులు.

ముందుగా మనకు గుర్తుకు వచ్చే స్విస్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ఈ దేశ తలరాతను మార్చేసింది. ఈ బ్యాంక్ లో ఖాతాదారుల వివరాలు ఎప్పటికీ గోప్యంగా ఉంటాయి అని ప్రకటించడంలో ఎంతో మంది నియంతలు, డ్రగ్ డీలర్లు, మాఫియా డాన్ లు ఇందులో డబ్బులు జమ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అయితే టన్నుల కొద్దీ బంగారం డిపాజిట్ చేశారు. మన దేశంలో చాలా మంది అవినీతిపరులైన రాజకీయ నాయకులకి అక్కడ అకౌంట్లు ఉన్నాయి.

ఇక పోతే వారు యుద్ధానికి వ్యతిరేకులు. తమ పక్క దేశం అయిన జర్మనీ మొదలెట్టిన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనలేదు అంటే వారు తమ పాలసీ పట్ల ఎంత నిబద్ధతతో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయినా ప్రపంచంలో శక్తివంతమైన 30వ మిలిటరీ సైన్యం వీరి సొంతం. ఈ దేశంలో 26 రాష్ట్రాలు కాంటన్ లు గా పిలవబడుతాయి.

ఇక్కడ "డైరెక్ట్ డెమోక్రసీ" ఉంటుంది. ఏదైనా చట్టం కేవలం నాయకులే కాకుండా ప్రజలు కూడా ఆమోదిస్తే పాస్ అవుతుంది. వ్యాపార పరంగా టెక్స్టైల్, చాక్లెట్ నుండి ఆదాయం ఎక్కువగా వస్తుంది. జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, రోమానియన్ ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాషలు 


మరింత సమాచారం తెలుసుకోండి: