ప్రస్తుతం దేశంలో ఎంతో కీలకంగా మారిన లోక్ సభ ఎన్నికలకు ప్రతీ ఒక్క పార్టీ తమ తమ పద్దతులలో ప్రచారలు మొదలుపెట్టేశారు. గూగుల్‌లో ప్రచారం కోసం (అడ్వర్‌టైజ్‌మెంట్స్) రాజకీయ పార్టీలు భారీ ఎత్తున డబ్బులను ఖర్చు చేస్తున్నాయి. గూగుల్ లో ప్రచారం కోసం అధికార పార్టీ బీజేపీ అత్యధికాంగా డబ్బు ఖర్చు చెస్తే, మన రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రెండవ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆరో స్థానంలో నిలిచినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.

గూగుల్‌‌లో అత్యధికంగా బీజేపీ యాడ్స్‌ను ఇచ్చింది. 554 యాడ్స్‌ కోసం రూ. 1.21 కోట్లను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది.గూగుల్ యాడ్ రెవిన్యూలో ఇది 32 శాతంగా ఆ సంస్థ తెలిపింది.బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 14 యాడ్స్ కోసం రూ. 54,100 ఖర్చు చేసింది. బీజేపీ తర్వాతి స్థానంలో వైసీపీ నిలిచింది.

వైసీపీ 107 యాడ్స్ ఇచ్చింది. దీని కోసం ఆ పార్టీ రూ.1.04 కోట్లను ఖర్చు చేసింది. పమ్మి సాయి చరణ్ రెడ్డి దీని కోసం డబ్బులను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది. మరో యాడ్స్ సంస్థ కూడ 43 యాడ్స్‌పై రూ. 26,400లను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది.

రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఎన్ని యాడ్స్, ఎంత ఖర్చు చేశారనే విషయమై నివేదికను ఈ మేరకు గురువారం నాడు గూగుల్ విడుదల చేసింది.గూగుల్‌లో ఇప్పటికే 831 యాడ్స్‌ కోసం అన్ని రాజకీయ పార్టీలు రూ.37 కోట్లను ఖర్చు పెట్టాయి.

వైసీపీ 107 యాడ్స్ ఇచ్చింది. దీని కోసం ఆ పార్టీ రూ.1.04 కోట్లను ఖర్చు చేసింది. పమ్మి సాయి చరణ్ రెడ్డి దీని కోసం డబ్బులను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది. మరో యాడ్స్ సంస్థ కూడ 43 యాడ్స్‌పై రూ. 26,400లను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: