చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణిని వైఎస్ జగన్ ఎక్కడికక్కడ ఏకి పారేస్తున్నారు. ఈ రోజు నెల్లూరు, కర్నూల్లో  జరిగిన ఎన్నికల సభల్లో చంద్రబాబు ప్రత్యేక హోదాపై పడిన పాట్లు, కప్ప దాట్లు జగన్ కళ్ళకు కట్టినట్లుగా వివరించి జనం మద్దతు పొందారు.


ప్ర‌త్యేక హోదా కావాలని ఒకసారి, వద్దని మరో సారి ఇలా అయిదేళ్ళ కాలంలో బాబు ఈ ఒక్క అంశం మీద వేసినన్ని పిల్లి మొగ్గలు మరో దాంట్లో వేయలేదని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి  బాబు హోదాకు అనుకూలంగా ఎపుడూ లేరని అయన విమర్శించారు. ఏదో ప్యాకేజితో సర్దుకుపోదామ్నుకున్నారని కూడా అయన అన్నారు. అయితే వైసీపీ బలంగా తన వాణిని జనంలోకి తీసుకుని వెళ్ళి హోదా కావాలని నినదించేసరికి బాబు దారికి వచ్చారని జగన్ సెటైర్లు వేశారు.


ఏపీకి సంజీవిని లాంటి హోదా కోసం తమ పార్టీకి మొత్తనికి మొత్తం పాతిక సీట్లను ప్రజలు అందించాలని జగన్ కోరారు. అపుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా హోదా తీసుకుని వస్తామని, కేంద్రం చేత తొలి ప్రకటన హోదా గురించి ఇప్పిస్తామని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని కూడా అయన క్లారిటీగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: