ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పి సంచలనం రేపిన నటి మాధవీ లత తర్వాత పవన్ కళ్యాన్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసి వెలుగు లోకి వచ్చింది.  శ్రీరెడ్డి కి సంఘీభావం తెలుపుతూనే ఆమె వ్యవహార శైలిపై ఘాటు విమర్శలు చేసింది మాధవీలత.  ఇటీవల బీజేపీలో చేరిన మాధవీలత గుంటూరు వెస్ట్ అభ్యర్థినిగా బరిలోకి దిగింది. ప్రస్తుతం ప్రచారంలో దూసుకు పోతున్న మాధవీలత ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతుంది.  తాను ఈ ఎన్నికల్లో గెలిచినా,ఓడినా ప్రజలతోనే ఉంటానని..ప్రజలు తనకు ప్రత్యక్ష దైవాలు అంటుంది. 

అంతే కాదు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న తాను రాజకీయాల్లో ఉంటే మరింత సేవ చేసే బాగ్యం దక్కుతుందని అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని అంటుంది. ఉన్నత చదువులు చదివిన తనకు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసు అని చెప్పారు.  అయితే ఇక్కడ కొంత మంది మహామేథావి నాయకులు ఉన్నారని..వారిలా తాను బీకాంలో ఫిజిక్స్ చదవుకులేదంటూ సెటైర్లు వేశారు. 

ప్రాంతీయ పార్టీల్లోకి వెళితే..కేవలం ఒక్క పార్టీకే అంకితం అవ్వాల్సి వస్తుందని..అందుకే తాను జాతీయ పార్టీలో చేరానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల కంటే గుంటూరు రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుందని, తనకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు ప్రజా సేవ చేయాలనే తపన ఉన్నవారే తప్ప దోచుకోవాలన్న ఆశ ఉండదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: