ఎలాంటి వారిని - అలాంటి వారితోనే ఢీ కొట్టిస్తారని పేరు చంద్రబాబుకి, ఎక్కడ ఎవరికి ఎలా చెక్ పెట్టాలో బాబుకి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు రాజకీయ విశ్లేషకులు.  మిగిలిన అన్ని విషయాలో లానే నాయకుల ఎంపికలో బాబు, తెదేపా బొక్క బోర్లా పడుతుందా అంటే అవుననే  అంటున్నారు ఆంధ్రప్రజ.


షర్మిల...జగన్ చెల్లిలిగా, వైఎస్ఆర్ తనయగానే కాకుండా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక ఆంధ్ర రాజకీయ కుటుంబ ఆడపడుచు, ప్రజల నాడిని పట్టి మాట్లాడడంలో దిట్ట అయిన షర్మిలను ఎదుర్కొనడానికి అనురాధను నియమించడం..అనురాధ ఎవరో - ఏంటో ఆంధ్రప్రజలకే సరిగ్గా తెలియనిది ఒక విషయమైతే.. ప్రెస్ మీట్ లకు పరిమితమవుతూ..నీడ పట్టున ేస్తున్న విమర్శలు బెడిసి కొడుతు్నాయంటున్నారు ఆంధ్రప్రజ.


సింపుల్ గా ఉంటూనే - గుండెలకు హత్తుకునే విధంగా మాట్లాడే విజయమ్మకు ఎదురుగా మల్లెపూలు, శుక్రవారం వంటి మాటలతో పాపులరయిన సాదినేని యామిని శర్మను మాట్లాడించడం హాస్యాస్పదమంటున్నారు ఆంధ్రప్రజ. 

మరోవైపు  తెదేపా 2019 ఎన్నికల ప్రచారంలో ఒక తప్పుని మించి మరొక తప్పు చేసుకుంటూ పోతుందని బాధ పడుతున్నారు తెదేపా అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: