సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నాయకుల వాడి, వేడి ప్రసంగాలతో ప్రచార సభలు హోరెత్తిపోతున్నాయి. పోలింగ్‌ సమీపిస్తుండటంతో ఇప్పటికే పలు సంస్థలు వివిధ పార్టీల విజయావకాశాలపై సర్వే ఫలితాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రాజకీయ పార్టీల సోషల్‌ మీడియా వార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ తారస్థాయికి చేరింది. 

ప్రజాసంకల్పయాత్రతో ప్రజలతో మమేకమై ప్రచార సభల్లో ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకుపోతుండగా, మరోవైపు ప్రతిపక్షంపై మాటల దాడి, పక్క రాష్ట్ర సీఎంపై విమర్శలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు  ప్రచారం కొనసాగిస్తున్నారు. తాజాగా వెలువడిన విశాఖ జిల్లాలోని 3 లోక్ సభ ,17 అసెంబ్లీ స్థానాల గెలుపు సర్వేలు వైసీపీ కి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ అందరూ హేమాహేమీలు పోటీ లో ఉండగా గెలుపు మాత్రం వైసీపీ దే అంటున్నాయి సర్వేలు.

అయితే 2014 ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న టీడీపీ రాష్ట్రంలోనే ప్రభల శక్తి గా వెలిగింది. అలాగే వైసీపీ కేవలం 3 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయ్యింది.ఇదంతా ఇలా ఉంటే ఈ సారి మాత్రం వైసీపీ గాలి బలంగా వీస్తుందని తేలింది. పోయిన ఎన్నికలకు పూర్తి వ్యతిరేక వాతావరణం జిల్లాలో కనిపిస్తుంది. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రభుత్వ వ్యతిరేకతలు తోడయ్యి వైసీపీ భారీ  మెజారిటీతో గెల్వబోతుందని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ ఈ సారి 8 స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని ,టీడీపీ 7 స్థానాలకు పరిమితం అవుతుందని తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: