ఎన్నికల వేళ చంద్రబాబు సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణానది వద్ద ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఇసుక అక్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి  జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.100కోట్లు జరిమానా విధించింది. ఇప్పటి వరకూ ఆంధ్ర ప్రదేశ్‌ లోని టీడీపీ ప్రభుత్వం తమ పాలన చాలా చక్కగా ఉందనీ 700 అవార్డులు వచ్చాయని గొప్పగా చెప్పుకుంటోంది. ఐతే, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏకంగా ₹100 కోట్ల జరిమానా విధించింది. ఇందుకు బలమైన కారణం ఉంది. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈ జరిమానా విధించింది. 
ఎన్నికల వేళ టీడీపీ ప్రభుత్వానికి షాక్... రూ.100,00,00,000 ఫైన్ వేసిన గ్రీన్ ట్రిబ్యునల్
ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌ లో ఇసుకను ఉచితంగా తవ్వుకోవచ్చని అనుమతులు ఇచ్చేసింది. అందువల్ల ప్రతి రోజు 2500 ట్రక్కుల్లో 25మీటర్లలోతు వరకు కృష్ణానదిలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ కు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు రిపోర్టులు ఇచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్ మేన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీలు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ని కోరారు. వాళ్లు వేసిన పిటిషన్‌ ను పరిశీలించిన గ్రీన్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి ₹100 కోట్ల జరిమానా విధించింది.
సంబంధిత చిత్రం
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ఇసుక ధర ఎక్కువగా ఉండేది. దాంతో, ఇల్లు కట్టుకోవడానికి పేదలు చాలా ఇబ్బందులు పడుతుంటే దళారులు ఇసుక ధరలను మరింత పెంచేస్తూ కొత్తసమస్యలు తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అందరూ ఉచితంగా ఇసుకను తవ్వుకోమని ఆదేశించింది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నా, ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఏపీలోని నదుల్లో పూడిక ఎక్కువైపోతోంది. తవ్వకాలు జరపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదంతా చేసే బదులు, ఒండ్రు ఉచితంగా ఇసుకను తవ్వుకోవచ్చని అనుమతులు ఇచ్చేస్తే, మేలు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే ఆ నిర్ణయం ప్రకటించింది.
national green tribunal fined AP Govt కోసం చిత్ర ఫలితం
ఏపీ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా, ఇసుకాసురులు అతి చేశారు. రోజూ ట్రాక్టర్లకు ట్రాక్టర్లు ఇసుకను తరలించుకు పోతున్నారు. అందువల్ల అసలుకే మోసం వచ్చినట్లైంది. ఈ సమస్యపై దృష్టిసారించే లోపే, ఎన్నికల హడావుడి మొదలైపోయింది. సో... ఇలాంటి అంశాల్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లెక్క లోకి తీసుకోలేదని తెలుస్తోంది. పర్యావరణానికి హాని జరిగిందన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైన్ వేసినట్లు చెబుతున్నారు.


చంద్రబాబు ప్రభుత్వ అపరాధానికి పెనాల్టీ ₹100 కోట్లు

కాగా నిబంధనల ప్రకారం పదిటైర్ల లారీకి 21 టన్నులు లోడ్‌ చేయాల్సి ఉండగా, 30నుంచి 40టన్నులు లోడ్‌ చేస్తూ పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు. రాత్రి 11 గంటలు దాటితే చాలు 60, 70 కిలోమీటర్ల స్పీడ్‌తో బాడీ లారీలు కాబిన్‌ లెవల్‌ ఇసుక లోడ్‌ వేసుకొని పరుగులు తీస్తున్నాయి. పోలీసులు ఎక్కడైనా గస్తీ కాస్తుంటే ముందస్తు గానే లారీ డ్రైవర్లకు సమాచారం ఇచ్చేందుకు మూడు కార్లను ఉపయోగించి, కొంత మంది తిరుగుతూ లారీ డ్రైవర్లకు సమాచారం ఇస్తున్నారు. 
The Free Sand System Pouring Crores To Irregulars In TDP Government - Sakshi
ఎవరైనా అధికారులు కానీ, పోలీసులుకానీ ఉన్నారని తెలిస్తే రాజధాని పరిధి లోని కృష్ణాయపాలెం, యర్రబాలెం చెరువు, మందడం, మందడం బైపాస్‌రోడ్డులో లారీల ను గప్‌చుప్‌గా పక్కనపెట్టి అధికారులు వెళ్లిన తర్వాత అక్కడనుంచి వారి గమ్యస్థానాలకు బయల్దేరుతున్నారు. ప్రతిరోజూ కనకదుర్గవారధి మీద నుంచి కృష్ణాజిల్లా గుడివాడ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలిపోతుంది.
NGT కోసం చిత్ర ఫలితం
రాజధాని పరిధిలోని ఇసుక రీచ్‌ల్లో పట్టపగలే లోడింగ్‌ చేయించుకొని, అర్ధరాత్రి దాటే వరకు లారీలను ఎక్కడో ఒక చోట దాచి పెట్టి, అర్ధరాత్రి దాటిన తరువాత వాటిని రోడ్డెక్కించి జనాలను భయభ్రాంతులను చేస్తూ, అధిక వేగంతో వెళ్తున్న ఇసుక లారీలను పట్టించుకోవడం లేదు. రాజధాని పరిధిలో అధిక లోడ్‌తో తరలివెళ్లే ఇసుక లారీకి మంగళగిరి ఆర్టీఓ పరిధిలో నెలకు రూ.30వేలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Threat to the Prakasham barrage! - Sakshi

తవ్వకాలు జరిపితే అటు ప్రకాశం బ్యారేజీకి ఇటు బ్రిడ్జికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నదిలో ఇసుకను ప్రొక్లెయిన్‌లతో తవ్వకూడదని పర్యావరణ చట్టాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇసుక స్మగ్లర్లు ఇదేమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న నేతల దన్నుతో వారు చెలరేగిపోతున్నారు. కృష్ణాజిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన దానికి భిన్నంగా ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యం గా బాబు మంత్రి వర్గంలో ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు తన బినామీలతో ఇసుకను కొల్లగొట్టి రూ. వేల కోట్లు గడిం చారు. ఉచితం పేరుతో ఇసుకను క్వారీల నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి రాత్రికి రాత్రే అనేక మంది అక్రమార్కులు లక్షాధికారులుగా మారారు.

సంబంధిత చిత్రం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక ఉచితం. కానీ జిల్లాలో ప్రస్తుతం ఐదు యూనిట్ల లారీ ఇసుక ధర దూరాన్ని బట్టి రూ. 20 వేలు పైగానే పలుకుతోంది. ఇదంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించినా గతం నుంచి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉచిత ఇసుక అనే పదం వినడానికే తప్ప ఆచరణలో అమలు కాలేదని చెప్పవచ్చు.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: