ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు రావడం..ఆయన హాజరు కావడం తెలిసిందే.   కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల  అమలుని ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం వివరణ కోరిన విషయం విదితమే.  మరోవైపు ఏపీ ఇంటెలిఎన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు  బదిలీ జీవో వివాదం వ్యవహారంపై డీజీపీని వివరణ కోరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
Image result for dgp tagore
ఓ వైపు ఏపిలో ఎన్నికల ప్రచారం కోనసాగుతుంది. ఈ నేపథ్యంలో డీజీపీకి ఈసీ నుండి పిలుపురావడం చర్చినియాంశంగా మారింది. ఇప్పటి వరకు రాష్ట్ర డీజీపీతో పాటు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆర్‌పీ ఠాకూర్.  తాజాగా  ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ ను ఆయన నిర్వహిస్తున్న యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ పదవి నుంచి తొలగించింది. ఆ పదవిలో  ఎస్.బి బాగ్చీని నియమిస్తూ చీఫ్ సెక్రటరీ అనీల్ చంద్ర పునీత ఉత్తర్వులు విడుదల చేశారు.


ఇంటెలీజెన్సీ ఏబి వెంకటేశ్వరరావు బదిలీలో ప్రవర్తించినట్లుగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవర్తించకుండా ఎన్నికల కమీసన్ ఆదేశాలు పాటించడం మంచి పరిణామమే అంటున్నారు..ఆంధ్రప్రజ.

మరింత సమాచారం తెలుసుకోండి: