ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ నుండి ఎంతో మంది చరిష్మా ఉన్న నేతలు జగన్ మోహన్ రెడ్డి యొక్క వైసీపీ పార్టీ వైపు మొగ్గచూపుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తెదేపాలో ఆశించిన గుర్తింపు రాకపోవడం కాగా మరొకటి ఇప్పుడు ఈ హీట్ పీరియడ్ లో గాలి అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వీస్తుండదమే. ఇప్పుడు మరో ఇద్దరు నేతలు లోటస్ పాండ్ సాక్షిగా వైసీపీ పార్టీలో చేరేందుకు తమ రంగం సిద్ధం చేసుకున్నారు.

వీరిలో ఒకరేమో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన సాయి ప్రతాప్ కాగా మరొకరు అమలాపురం సీనియర్ నేత హర్ష కుమార్. సాయి ప్రతాప్ మంచి పలుకుబడి, అనుభవం గల నేత. వైయస్ ఉన్న సమయంలో ఈయనకు అభ్యర్థుల అందరిలోకి ప్రత్యేక గుర్తింపు ఉండేది. అయితే టీడీపీ లో అలాంటి వాతావరణం అతనికి కనిపించలేదు.

అతను తెదేపా తరుపు నుండి రాజంపేట అసెంబ్లీ సీట్ ఆశించడం, అతనికి కాకుండా అధిష్టానం ఇంకొకరికి అది కట్టబెట్టడం తో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు హర్ష కుమార్ కూడా మరోసారి అమలాపురం ఎంపీ టికెట్ కోరగా బాబు దానిని మాజీ స్పీకర్ కొడుకు కి ఇచ్చారు. దీనితో వీరిద్దరి జగన్ ప్రస్తుతం చేస్తున్న సుడిగాలి పర్యటనలో మంచి సమయం చూసుకొని పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: