మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు దేశంలో ఒక సంచలనమైన వార్త వెలుగు లోకి వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ లోనే భారీ మొత్తంలో నొట్ల కట్టలు బయటపడ్డాయి. ఇది ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖాండు యొక్క కాన్వాయ్ లో 180 లక్షల రూపాయలు దొరికాయి.

విశేషం ఏమిటంటే పక్క రోజు పాశీ ఘాట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ పెట్టుకొని ఇలా జరగడం కొత్త అనుమానాలకి దారితీస్తుంది. కాంగ్రెస్ యూత్ వింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ వాహనం పైన రైడ్ చేసి కోటీ ఎనభై లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు ఇంకా ఎలాంటి సక్రమమైన చర్యలు తీసుకోకపోవడం వారిని ఆగ్రహానికి గురి చేస్తోంది.

దీనిపైన కాంగ్రెస్ పార్టీ వారు పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశవ్యాప్తంగా డబ్బు ఏరులై పారుతోంది అధికార పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జీవాళా అన్నారు. ఓటుకు నోటు పాలసీని బీజేపీ తమ మార్క్ రాజకీయంగా చేస్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి పన్నెండు గంటలకు దొరికినా, దీని పైన ఇంకా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: