వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే త‌న సుడిగాలి పర్య‌ట‌న‌తో రాష్ట్రం చుట్టేసి వ‌చ్చిన జ‌గ‌న్‌...ఈ ఉగాది రోజున కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. సుదీర్ఘంగా, స‌మ‌గ్రంగా చేస్తున్న చేస్తున్న మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న విడుద‌లైన నేప‌థ్యంలో..మేనిఫెస్టో విడుదలకు ముహూర్తంగా ఉగాది రోజును జ‌గ‌న్ ఖరారు చేశారు. వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తేదీ ఎట్టకేలకు ఫిక్స్ అవ‌డంతో...అంద‌రి దృష్టి వైసీపీపై ప‌డింది. 


అన్ని వ‌ర్గాల‌కు మేలు చేసేలా మొత్తం 31 మందితో మేనిఫెస్టో కమిటీని జగన్ నియమించారు. సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీనియర్ నేతలు మేకపాటి, ధర్మాన, బోత్సతో పాటు పలువురికి చోటు కల్పించారు. వాగ్ధానాల విషయంలో ఏ పార్టీతో పోటీ పడకుండా మేనిఫెస్టో రూపొందించాలని జగన్ మేనిఫెస్టో కమిటీకి గతంలోనే సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు… నవరత్నాలన్నింటిని జగన్ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ రూపొందించినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో ప్రధానంగా అమలుకు హామీ కాని వాగ్ధానాలకు పార్టీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కౌలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఎన్నికల ప్రచారంలో జగన్ ఇస్తున్న ఏ ఒక్క హామీని వదలకుండా అన్నింటిని మేనిఫెస్టోలో చేర్చాల్సిందేనని జగన్ సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ‌మైన ఫ‌లాలు అందించేలా అద్భుతమైన మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ఉగాది రోజున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని భావించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అమరావతి వేదికగా మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: