ఆంధ్రా రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.. కేసీఆర్ పేరు ఎత్తకుండా ఆంధ్రానాయకులు ఎన్నికల ప్రచారం చేయలేకపోతున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు సంగతి సరే సరి.. ఆయన పొద్దునలేస్తే కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. 


మరోవైపు పవన్ కల్యాణ్ మరో ఆకు ఎక్కువే చదివారు.. ఆంధ్రావాళ్లను తెలంగాణలో కొడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వాస్తవంగానే కలకలం రేపాయి. దీనిపై పోసాని కృష్ణమురళి, చిన్నికృష్ణ వంటి వారు ఘాటుగానే స్పందించారు. 

కేసీఆర్ ను సపోర్ట్ చేస్తున్నట్టు కొందరు వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంపై సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. అసలు ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్‌ ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. 

మీరు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పుకోండి.. అంతే తప్ప.. కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని కొందరు.. సపోర్ట్ చేస్తూ కొందరు ఎందుకు మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి నిలదీశారు. 

రాజకీయాల కోసం టీడీపీ ఈ గేమ్ మొదలుపెడితే.. ఆ ట్రాప్‌లోకి మెల్లగా పవన్ కల్యాణ్‌., ఆ తర్వాత వైసీపీ నేతలు పడుతున్నారని తమ్మారెడ్డి విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: