ఇప్పటి వరకూ ఆంధ్రా ఎన్నికలపై వచ్చిన దాదాపు అన్ని సర్వేలు వైసీపీయే గెలుస్తుందని చెబుతూ వచ్చాయి. కొన్ని బొటాబొటి మెజారిటీ అంటే.. చాలావరకూ వైసీపీ ప్రభంజనం సృష్టిందని చెప్పాయి. చాలా సర్వేలు కనీసం 100 స్థానాలు వైసీపీకి వస్తాయని అంచనా వేశాయి. 


ఈ సమయంలో టీడీపీకి ఊరట కలిగిస్తూ.. టీడీపీ గెలుస్తుందని న్యూస్‌ ఎక్స్‌ పోల్‌స్ట్రాట్‌ ప్రకటించిందట. శాసనసభ ఎన్నికల్లో టీడీపీ 2014తో (102) పోలిస్తే.. 10 సీట్లు కోల్పోయి 92 సీట్లు సాధిస్తుందట. వైసీపీ 2014తో పోలిస్తే 10 సీట్లు పెంచుకుని 77 సీట్లు సాధిస్తుందట. 

ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. కాంగ్రెస్‌కు 4.. బీజేపీకి ఒకటి, తెలుగుదేశానికి 16, వైసీపీకి 9 వస్తాయట. అయితే ఈ సర్వే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించడంతో అనుమానాలు వస్తున్నాయి. ఇదైనా నిజమైన సర్వేనా లేక.. ఫేకా అని జనం అనుమానపడుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీకి నాలుగు పార్లమెంటు సీట్లు వస్తాయని చెబుతున్నప్పుడే దీనిపై అనుమానం పెరుగుతుంది. 13 శాతం ఓటు షేరుతో ఆ పార్టీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందట. బీజేపీకి 9 శాతం ఓట్లు, ఒక అసెంబ్లీ సీటు వస్తాయట. మొత్తానికి టీడీపీ వాళ్లకు చెప్పుకునేందుకు ఒక సర్వే దొరికిందని సంబరపడేలా ఈ సర్వే ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: