లక్ష్మి పార్వతీ మీద లైంగిక కేసు నమోదు కావటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక ప్రచారంలో దూసుకుపోతున్న లక్ష్మీ పార్వతి పై ఊహించని విధంగా లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమె దగ్గర అనుచరుడిగా గత కొంత కాలంగా పని చేస్తున్న వ్యక్తి . వైసీపీ నేత ల‌క్ష్మీ పార్వ‌తి త‌న‌ను లైంగికంగా వేధిస్తుంద‌ని, త‌ల్లిలాంటి భావ‌న‌తో ఉన్న త‌నను వేధించొద్దంటూ ఎంత వేడుకున్నా ఆమె విన‌డం లేద‌ని ఆమె వ‌ద్ద గ‌త కొంత కాలంగా అనుచ‌రుడిగా ఉంటున్న కోటి అనే వ్య‌క్తి గుంటూరు జిల్లా వినుకొండ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.


అంతేకాకుండా తాను చెప్పిన‌ట్టు వింటే వైసీపీలో మంచి ప‌ద‌వి ఇప్పిస్తాన‌ని లేదంటే ఇబ్బంది పడతావు అని హెచ్చరిక‌లు జారీ చేసింద‌ని కోటి వినుకొండ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అతని ఫిర్యాదు లో ఏ మేరకు వాస్తవం వుందో తెలీదు కానీ ఎన్నికల ప్రచారంలో ఉన్న లక్ష్మీ పార్వతికి ఈ వార్త పెద్ద షాక్ అని చెప్పాలి. ఈ ఒక్క ఫిర్యాదు మాత్రమే కాదు.. లక్ష్మీపార్వతి చేసిన కొన్ని వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్, మరికొన్ని ఆడియో టేపుల్ని కూడా పోలీసులకు అందించారు కోటి.


కోటి అనే యువకుడితో అసభ్యకరంగా చాటింగ్ చేయడమే కాకుండా,ఐ లవ్ యూ అంటూ.. మెసేజ్ పెట్టినట్లుగావాట్సాప్ చాటింగ్ లో ఉంది. ఇక ఎయిర్ చేసిన ఆడియో టేపుల్లో ఎన్టీఆర్ పై ఏ మాత్రం గౌరవం లేకుండా.. లక్ష్మీపార్వతి మాట్లాడారు. చాలా దుర్మార్గాలు చేశారని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై అనేక ఆరోపణలు చేశారు. అవన్నీ నిజమేనన్నట్లుగా లక్ష్మీపార్వతి మాట్లాడటం ఆడియో టేపుల్లో ఉంది. ఆడియో టేపులలో మోహన్ బాబు ప్రస్తావన కూడా ఉంది. ఆయన వైసీపీలో చేరిన తర్వాతనే ఆ ఆడియోను రికార్డు చేసినట్లుగా ఉన్నారు. ఆయన చంద్రబాబుపై కోపంతో వైసీపీలోకి వచ్చారని మోహన్ బాబు ఒక వేస్ట్ ఫెలో అంటూ ఆమె మోహన్ బాబుని తీసి పారేసింది. ఈ ఆడియో టేపులు , చాటింగ్ స్క్రీన్ షాట్స్ వంటి ఆధారాలతో ఆమెపై లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమె అనుచరుడు కోటి.  

మరింత సమాచారం తెలుసుకోండి: