ఏపీ ఎన్నికల పోరు పీక్ కు చేరుతున్న నేపథ్యంలో సర్వేల జోరు కూడా కొనసాగుతుంది. ఏపీలో ముక్కోణపోరు ఉండటంతో జనం కూడా ఈ సర్వేలను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సర్వేల్లో చాలా వరకూ వైసీపీ గెలుస్తుందని చెబితే.. ఒకటీ ఆరా టీడీపీ గెలుస్తుందని చెప్పాయి. 


ఐతే.. తాజాగా యుక్తా NVI అనే సంస్థ మాత్రం విభిన్నమైన ఫలితాలు చూపిస్తోంది. ఏపీలో అసలు పోటీ వైసీపీ- జనసేన మధ్యనే ఉందట. టీడీపీది ధర్ట్ ప్లేస్‌ అట. వైసీపీ- జనసేన రెండు పార్టీలకూ చెరో 62 సీట్లు వస్తాయట. అంటే ఏపీలో హంగ్ వస్తుందన్నమాట. 

అసలు ఏపీలో హంగ్‌ వస్తుందని చెప్పిన మొదటి సర్వే ఇదే కావచ్చు.. అయితే హంగ్ వచ్చినా పవన్ కల్యాణ్ సీఎం అవుతరాట. అంటే బహుశా మూడో స్థానంలో నిలిచిన టీడీపీ పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేస్తుందని సర్వే సంస్థ ఉద్దేశం కావచ్చు. టీడీపీకి 43 సీట్లు వస్తాయని అంచనా వేసిందీ సంస్థ.. 

ఎన్నారైలకు చెందిన ఈ సంస్థ తాము చాలా పద్దతిగా సర్వే చేశామని చెబుతోంది. ఏదేమైనా మొత్తానికి జనసేన కూడా ఈ సర్వేతో ఖుషీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఆ పార్టీకి ఇరవైకి మించి స్థానాలు వస్తాయని ఏ సంస్థ కూడా అంచనా వేయలేదు. సో.. వారికి ఈ సర్వే ఊరట ఇవ్వొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: