ఏపీలో పోలింగుకు ఇంకా ఆరు రోజుల గడువు మాత్రమే ఉంది. అంటే దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజా తీర్పు ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారన్న మాట. అయిదేళ్ళ చంద్రబాబు పాలన. ఆయన అనుభవం కొత్త రాష్ట్రంలో అయన చేసిన పాలన, అయిదేళ్ల పాటు జగన్ ప్రతిపక్ష పాత్ర, కొత్త రాజకీయమంటూ వచ్చిన పవన్ జనసేన గురించి ఓటరు తీర్పు చెప్పేందుకు కౌంట్ డౌన్ మొదలైంది.


ప్రస్తుతం ఏపీలో మూడు కోట్ల 90 లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో  గరిష్టంగా  76.80 శాతం పైగా పోలింగ్ జరిగింది.  మూడు కోట్ల 68 లక్షల మంది ఓటర్లు తమ ఓట్లు వేశారు. ఈసారి పెరిగిన ఓటర్లతో పోలింగ్ మరింతగా  పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో యువత కొత్తగా వచ్చిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఏపీలో ఇపుడున్న సీన్ చూస్తే వస్తే భారీ ప్రభంజనం  రావాలి. లేకపోతే యధాతధ గట్టి పోటీ జరగాలి. అయితే పోలింగు దగ్గర పడుతున్న కొద్దీ సీన్ మారుతోంది.


ఓ వైపు జగన్ సభలకు జనం వెల్లువలా రావడం జరుగుతోంది. అది కూడా మండుటెండల్లో  సైతం ఆయన కోసం వేచి చూడడం ఓ సంకేతంగా భావించాలి. ఇక ఆయన సోదరి షర్మిల సభలకు కూడా జనం వస్తున్నారు. మరో వైపు తల్లి విజయమ్మ సభలకూ ఇదే తీరున పోటెత్తుతున్నారు.
దీన్ని సంకేతంగా తీసుకుంటే ప్రజల్లో మార్పు రావాలన్న ఆకాంక్ష కచ్చితంగా కనిపొస్తీందని పొలిటికల్ పండిట్స్ అంచనా కడుతున్నారు. అదే జరిగితే వార్ వన్ సైడ్ అవుతుందని కూడా అంటున్నారు. మరో వైపు టీడీపీ ప్రచారంలో కొత్తదనం లేకపోవడం, మూడవ పక్షం సైతం బలంగా గొంతు ఎక్కడా వినిపించలేకపోవడంతో ఏపీలో వార్ వన్ సైడ్ అవుతుందన్న అంచనాలు బాగా బలపడుతున్నాయి. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: